New Year 2024: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలకు సిద్ధమయ్యారా? పోలీసుల ఆంక్షలు గుర్తుంచుకోండి మరి...!

  • ఫ్లైఓవర్లు, పీవీ ఎక్స్‌ప్రెస్ వే, ఔటర్ రింగ్ రోడ్డుపై రాకపోకల నిషేధం
  • విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకు మాత్రమే ఔటర్ రింగ్ రోడ్డుపై అనుమతి
  • క్యాబ్, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని పోలీసుల సూచన
Hyderabad police traffic restriction on the eve of 2024

రేపు న్యూఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్నారా? అయితే హైదరాబాద్‌లో కొత్త సంవత్సర వేడుకలపై పోలీసుల ఆంక్షలను మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే...! సైబరాబాద్ పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.  ఫ్లైఓవర్లు, పీవీ ఎక్స్‌ప్రెస్ వే, ఔటర్ రింగ్ రోడ్డుపై రాకపోకలను నిషేధించినట్లు పోలీసులు తెలిపారు. రేపు రాత్రి 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు వాహనాలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకు మాత్రమే ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్‌వైపై అనుమతి ఇస్తారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

క్యాబ్, ఆటో డ్రైవర్లకు కూడా పోలీసులు సూచనలు జారీ చేశారు. రేపు కచ్చితంగా యూనిఫామ్ ధరించాలని తెలిపారు. ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు మద్యం తాగి నడిపితే చర్యలు ఉంటాయన్నారు. పబ్‌లలో మందు తాగి వాహనాలు నడిపితే.. తాగిన వ్యక్తితో పాటు పబ్ యజమానిపై కూడా కేసు నమోదు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. అలాంటి కస్టమర్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. రేపు రాత్రి ఎనిమిది గంటల నుంచి డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు.

More Telugu News