Johnny Master: నెల్లూరులో అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతు తెలిపిన జానీ మాస్టర్ 

Tollywood choreographer Johnny Master extends support to Anganwadi workers
  • సొంతగడ్డ నెల్లూరు విచ్చేసిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్
  • అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతు
  • జగన్ మాట నిలబెట్టుకోవాలని వ్యాఖ్యలు
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అంగన్వాడీ కార్యకర్తల సమ్మెకు మద్దతు పలికారు. తన స్వస్థలం నెల్లూరు విచ్చేసిన జానీ మాస్టర్ అంగన్వాడీ కార్యకర్తల శిబిరానికి వచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. 

అంగన్వాడీల జీతం పెంచుతానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్... అధికారంలోకి రాగానే మాట తప్పడం తగదని జానీ మాస్టర్ పేర్కొన్నారు. కాన్పు తర్వాత తన భార్య ఇద్దరు బిడ్డలతో ఎంతో ఇబ్బంది పడిందని, అలాంటి ఎంతో మంది బిడ్డలను ఓపికతో ఆదరిస్తున్న అంగన్వాడీ తల్లుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. 

ఈ సందర్భంగా జానీ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ అంటే ఇష్టం అంటూనే విమర్శనాత్మకంగా వ్యాఖ్యలు చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కౌంటర్ ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మకు పవన్ కల్యాణ్ అంటే ఏ విధంగా ఇష్టమో, నాకు జగన్ అంటే ఆ విధంగా ఇష్టం అని వ్యాఖ్యానించారు.
Johnny Master
Anganwadi Workers
Nellore
Pawan Kalyan
Jagan
Ram Gopal Varma
Tollywood

More Telugu News