Botsa Satyanarayana: రెండు నెలల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో మీ కోర్కెలు తీర్చలేం: బొత్స సత్యనారాయణ

We can not fulfil Anganwadis demands says Botsa Satyanarayana
  • అంగన్వాడీల సమ్మెపై బొత్స సంచలన వ్యాఖ్యలు
  • తెలంగాణలో జీతాలు పెంచినప్పుడల్లా ఇక్కడ కూడా పెంచుతామని తాము చెప్పలేదని వ్యాఖ్య
  • దోపిడీ కోసం చంద్రబాబు అప్పులు చేశారని విమర్శ
జీతాల పెంపు, గ్రాట్యుటీల డిమాండ్లతో అంగన్వాడీలు సమ్మెను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... మరో రెండు నెలల్లో ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో ఇప్పటికిప్పుడు కోర్కెలు తీర్చడం సాధ్యం కాదని చెప్పారు. తెలంగాణలో అంగన్వాడీలకు జీతాలు పెంచినప్పుడల్లా ఇక్కడ కూడా పెంచుతామని తాము ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. చంద్రబాబు తన దోపిడీ కోసం అప్పులు చేశారని... జగన్ ప్రజా సంక్షేమం కోసం అప్పులు చేస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత లేనివారికి మాత్రమే టికెట్లను నిరాకరిస్తున్నట్టు తెలిపారు. ప్రజల ఆమోదం ఉన్నవారికి టికెట్లు వస్తాయని చెప్పారు.
Botsa Satyanarayana
YSRCP
Anganwadi
Chandrababu
Telugudesam

More Telugu News