KTR: జనవరి 3వ తేదీ నుంచి పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు

  • కేటీఆర్, హరీశ్ రావు, పోచారం, జగదీశ్, ప్రశాంత్, నిరంజన్, కేకే, మధుసూదనాచారిల నేతృత్వంలో సమావేశాలు
  • తొలి విడతలో జనవరి 3వ తేదీ నుంచి 12 వరకు సమావేశాలు
  • రెండో విడత జనవరి 16వ తేదీ నుంచి 21 వరకు సమావేశాలు
BRS parliamentary constituencies meeting from january 3

రానున్న లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ భవన్ వేదికగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సీనియర్ నేతలు కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి తదితరులు కీలక నేతలు సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి. తొలి విడతలో జనవరి 3వ తేదీ నుంచి 12 వరకు, రెండో విడత జనవరి 16వ తేదీ నుంచి 21 వరకు జరగనున్నాయి.

జనవరి 3న ఆదిలాబాద్, 4న కరీంనగర్, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్, 11న మహబూబాబాద్, 12న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశాలు జరుగుతాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజులు విరామం ఇస్తారు. రెండో విడతలో భాగంగా 16న నల్గొండ , 17న నాగర్ కర్నూల్‌, 18న మహబూబ్‌నగర్‌, 19న మెదక్ , 20న మల్కాజ్‌గిరి, 21 సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజవర్గాల సమావేశాలు జరుగనున్నాయి.

More Telugu News