తెలంగాణ నేర వార్షిక నివేదికను విడుదల చేసిన డీజీపీ రవి గుప్తా
- గత ఏడాదితో పోలిస్తే నేరాలు 8.97 శాతం పెరిగినట్లు వెల్లడి
- ఈ ఏడాది మొత్తం 2,13,121 కేసులు నమోదు చేశామన్న డీజీపీ
- సైబర్ నేరాలు 17.59 శాతం పెరిగినట్లు వెల్లడి
2023లో రాష్ట్రంలో 1,360 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని, గత ఏడాదితో పోలిస్తే ఇవి 15.6 శాతం అధికమన్నారు. 2,52,60 కిలోల గంజాయి, 1,240 గంజాయి మొక్కలను సీజ్ చేసి.. 2583 మందిని అరెస్ట్ చేశామన్నారు. 1,877 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయన్నారు. డ్రగ్స్ నియంత్రణకు యాంటి నార్కోటిక్ బ్యూరోను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 59 డ్రగ్స్ కేసుల్లో 182 మందిని అరెస్ట్ చేశామన్నారు. 175 మంది రిపీటెడ్ డ్రగ్ ఫెడ్లర్స్పై పీడీ యాక్ట్ నమోదు చేశామని, 12 మంది ఫారెన్ అఫెండర్స్ను అరెస్ట్ చేశామన్నారు.