Kesineni Nani: మోదీ నిర్ణయాన్ని అభినందిస్తున్నా: కేశినేని నాని

I appreciate Modi decision says Kesineni Nani
  • మరో 3 నెలల్లో చంద్రబాబు సీఎం అవుతున్నారన్న కేశినేని నాని
  • ఓల్డ్ జీజీహెచ్ ను ఎయిమ్స్ మాదిరి అభివృద్ధి చేస్తామని వ్యాఖ్య
  • నియోజకవర్గ అభ్యర్థులను మార్చడమనేది వైసీపీ ఇష్టమన్న కేశినేని
మరో మూడు నెలల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని... ఆ తర్వాత ఓల్డ్ జీజీహెచ్ ను ఎయిమ్స్ మాదిరి అభివృద్ధి చేస్తామని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఓల్డ్ జీజీహెచ్ లో రోగులకు మంచినీటిని కూడా సరఫరా చేయలేకపోతున్నారని మండిపడ్డారు. విజయవాడకు క్రిటికల్ కేర్ యూనిట్ ను ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. 

కొవిడ్ తర్వాత పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందివ్వాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకోవడాన్ని అభినందిస్తున్నానని అన్నారు. తన సిఫారసుతోనే కేంద్ర ప్రభుత్వం క్రిటికల్ కేర్ బ్లాక్, బీఎస్ఎల్3 ల్యాబ్ ను మంజూరు చేసిందని చెప్పారు. నియోజకవర్గాల అభ్యర్థులను మార్చడమనేది వైసీపీ ఇష్టమని, దానిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని అన్నారు.
Kesineni Nani
Chandrababu
Telugudesam
Narendra Modi
BJP

More Telugu News