Kakinada: కాకినాడలో అర్ధరాత్రి వేళ ఎన్టీఆర్ విగ్రహం తొలగింపునకు యత్నం... అడ్డుకున్న టీడీపీ శ్రేణులు

  • కాకినాడ దుర్గమ్మ ఆలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు యత్నం భగ్నం
  • ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరుల పనే అంటూ టీడీపీ వర్గం ఆందోళన
  • ఇరువర్గాలను డీఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్లి మాట్లాడిన పోలీసులు
Tension raises in Kakinada after some people try to remove NTR statue

కాకినాడలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు యత్నాన్ని టీడీపీ శ్రేణులు భగ్నం చేశాయి. పట్టణంలోని సంతచెరువు దుర్గమ్మ ఆలయం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని అర్ధరాత్రి వేళ తొలగిస్తుండగా, టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వర్గీయులే ఎన్టీఆర్ విగ్రహం తొలగిస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. 

అనంతరం టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అక్కడికి వైసీపీ శ్రేణులు కూడా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను డీఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్లి వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. 

ఆరేళ్ల కిందట చేసిన కౌన్సిల్ తీర్మానం మేరకే ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశామని, ఆ విగ్రహం వల్ల ఎవరికీ ఇబ్బంది లేకపోయినా, ఇప్పుడు కుట్రపూరితంగా తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి.

More Telugu News