Chandrababu: బెంగళూరు ఎయిర్ పోర్టులో పరస్పరం ఎదురైన చంద్రబాబు, డీకే శివకుమార్... వీడియో ఇదిగో!

Chandrababu and DK Shivakumar pep talk at Bengaluru airport
  • ఇవాళ కుప్పం పర్యటనకు వచ్చిన చంద్రబాబు
  • హైదరాబాద్ నుంచి బెంగళూరుకు విమానంలో వచ్చిన బాబు
  • అదే సమయంలో నాగపూర్ వెళ్లేందుకు వచ్చిన డీకే
  • కరచాలనం చేసుకుని కాసేపు మాట్లాడుకున్న నేతలు
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ కుప్పం పర్యటనకు ముందు బెంగళూరు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆసక్తికర దృశ్యం కనిపించింది. బెంగళూరు ఎయిర్ పోర్టులో చంద్రబాబు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పరస్పరం ఎదురయ్యారు.

హైదరాబాద్ నుంచి కుప్పం వెళ్లేందుకు బెంగళూరు వచ్చిన చంద్రబాబు విమానం దిగగా... అదే సమయంలో నాగపూర్ వెళ్లే విమానం ఎక్కేందుకు డీకే శివకుమార్ అక్కడికి వచ్చారు. ఇరువురు ఎదురుపడడంతో మర్యాదపూర్వకంగా పలకరించుకున్నారు. 

కరచాలనం అనంతరం చంద్రబాబు, డీకే శివకుమార్ కొద్దిగా పక్కకు వెళ్లి కాసేపు మాట్లాడుకున్నారు. దీనిపై టీడీపీ వర్గాలు స్పందించాయి. ఇందులో రాజకీయ కోణం ఏమీ లేదని, ఇద్దరూ మర్యాదపూర్వకంగా మాట్లాడుకున్నారని స్పష్టం చేశాయి.
Chandrababu
DK Shivakumar
Airport
Bengaluru
TDP
Congress
Andhra Pradesh
Karnataka

More Telugu News