Amit Shah: తెలంగాణలో 35 శాతం ఓట్లు... 10 సీట్లు లక్ష్యం: బీజేపీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం

Amit Shah set target of 10 lok sabha seats to T BJP
  • తెలంగాణ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న అమిత్ షా
  • దేశవ్యాప్తంగా 400 లోక్ సభ స్థానాల్లో గెలుపు సాధిస్తామని ధీమా
  • తెలంగాణలో కాంగ్రెస్ గెలవలేదని... బీఆర్ఎస్ ఓడిపోయిందని వ్యాఖ్య
రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి 35 శాతానికి పైగా ఓట్లు... 10కి పైగా సీట్లు రావాలని బీజేపీ అగ్రనేత అమిత్ షా అన్నారు. ప్రతి కార్యకర్త కూడా ఈ పార్టీ 'నాది' అనే ఆలోచనతో పని చేయాలని సూచించారు. హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలు కుటుంబ పాలన నుంచి విముక్తి పొంది.. మరో కుటుంబ పార్టీ చేతిలో పడ్డారని వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించలేదని.. బీఆర్ఎస్‌ను ఓడించారన్నారు.

అందుకే 35 శాతం ఓట్లు... 10 సీట్లలో గెలుపు లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ప్రతి కార్యకర్త కష్టపడి పని చేస్తే దేశవ్యాప్తంగా బీజేపీ 400కు పైగా స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే సీటు మాత్రమే గెలిచిందని... ఇప్పుడు ఎనిమిది స్థానాల్లో విజయం సాధించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు.
Amit Shah
Telangana
BJP
Lok Sabha

More Telugu News