nanda kumar: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు నందకుమార్ కీలక వ్యాఖ్యలు

Accused Nanda Kumar hot comments
  • అసలు నేను నిందితుడినో... బాధితుడినో ప్రభుత్వం తేల్చాలన్న నందకుమార్
  • రోహిత్ రెడ్డితోనే తనకు పరిచయం ఉందన్న నందకుమార్
  • రామచంద్ర భారతిని పరిచయం చేసిందే దాసోజు శ్రవణ్ అన్న నందకుమార్

ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నందకుమార్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అసలు తాను నిందితుడినో.. బాధితుడినో ప్రభుత్వం తేల్చాలని వాపోయాడు. తనకు కేవలం రోహిత్ రెడ్డితోనే పరిచయం ఉందన్నాడు. మిగతా నలుగురు ఎమ్మెల్యేలు తనకు తెలియదన్నాడు. ఢిల్లీ పెద్దవాళ్లను పరిచయం చేస్తారా? అని అతను తనను అడిగాడని... ఆ తర్వాత రామచంద్ర భారతి అనే స్వామిని పరిచయం చేసినట్లు చెప్పాడు. రోహిత్ రెడ్డిని విచారిస్తే అసలు విషయం బయటకు వస్తుందన్నాడు. అసలు రామచంద్ర భారతిని తనకు పరిచయం చేసిందే బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అని తెలిపారు. ఈ కేసులో సీబీఐ దర్యాఫ్తు జరిపితే అసలు నిజాలు బయటకు వస్తాయన్నాడు.

ఆ రోజు ఫామ్ హోస్‌లో జరిగిన విషయాలన్నింటినీ తాను త్వరలోనే బయటపెడతానన్నాడు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టు పరిధిలో ఉందని... కాబట్టి ఇప్పుడే ఏం మాట్లాడలేనని తెలిపాడు. తనను, తన కుటుంబాన్ని అకారణంగా రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. అక్రమ కేసులతో పోలీసులు తనను తీవ్రంగా వేధించారని, డ్రగ్స్ కేసులో కూడా ఇరికించాలని చూశారని ఆరోపించాడు.

  • Loading...

More Telugu News