Singareni Collieries Company: కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏఐటీయూసీ విమర్శలు

AITUC alleges Congress government over Singareni election
  • గత ప్రభుత్వానికి... ప్రస్తుత ప్రభుత్వానికి తేడా లేదన్న ఏఐటీయూసీ నాయకుడు
  • ప్రభుత్వ పెద్దలు... కార్మికులను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నాలు చేశారని ఆరోపణ
  • మణుగూరులో అధికారుల నిర్లక్ష్యం కారణంగా రెండు ఓట్ల తేడాతో ఓడిపోయామన్న ఏఐటీయూసీ నాయకుడు
గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా లేదని ఏఐటీయూసీ రాష్ట్ర అడిషనల్ జనరల్ సెక్రటరీ మిర్యాల రంగయ్య విమర్శించారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలిచిందని... ఈ ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లోనూ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, మంత్రులు... కార్మికులను రాయితీలతో ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అయినా తాము విజయం సాధించామన్నారు.

ఏరియాలవారీ విషయానికి వస్తే మణుగూరులో ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం కారణంగా రెండు ఓట్ల తేడాతో తాము ఓడిపోయామన్నారు. ఇక్కడ రీకౌంటింగ్ కోసం అప్పీల్ చేస్తామన్నారు. ఇక్కడ మంత్రి వచ్చి ప్రలోభాలతో ఓట్లను లాగేసుకున్నారన్నారు. గుర్తింపు సంఘంగా చట్టసభల్లో మాట్లాడి కార్మికులకు లబ్ధి చేకూరుస్తామన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీపై ఏఐటీయూసీ 1999 ఓట్ల ఆధిక్యంతో గెలిచింది.
Singareni Collieries Company
election

More Telugu News