BJP: చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి పనికిమాలిన పనులు: రేవంత్ రెడ్డిపై బీజేపీ

Telangana BJP satires on CM Revanth Reddy
  • రేవంత్ రెడ్డి వెళ్తుండగా ప్రజలు ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బంది పడుతున్నారన్న బీజేపీ
  • పత్రికల్లో రేవంత్ రెడ్డి సర్కారు పెద్ద ఎత్తున ప్రకటనల కోసం ఖర్చు చేసిందని విమర్శ
  • చెప్పింది ఒకటి చేస్తోంది మరొకటి అని తెలంగాణ బీజేపీ ట్వీట్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ ట్విట్టర్ హ్యాండిల్ ముఖ్యమంత్రిని టార్గెట్ చేసింది. కొన్ని రోజుల క్రితం సీఎం రేవంత్ మాట్లాడుతూ... తాను కాన్వాయ్‌తో వెళ్లే సమయంలో నిబంధనల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని... ఎక్కువసేపు ట్రాఫిక్‌ను నిలుపువద్దని.. తాను బయలుదేరే కొద్ది సమయం ముందు ఆపితే చాలని అధికారులకు సూచించారు. మరో సందర్భంలో... తెలంగాణకు అప్పులు ఉన్నాయని.. ప్రకటనలకు ఎక్కువగా ఖర్చులు చేయవద్దని అధికారులకు సూచించారు.

అయితే వీటికి భిన్నంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనిపిస్తోందని బీజేపీ పేర్కొంది. ఇందుకు సంబంధించి ఓ ట్వీట్ చేసింది. చెప్పేవి శ్రీరంగ నీతులు... చేసేవి పనికిమాలిన పనులు అని పేర్కొంది.

ఆర్భాటాలు వద్దు.. ప్రజలకు అసౌకర్యం కలిగించవద్దని సీఎం రేవంత్ చెప్పారని.. కానీ భారీ కాన్వాయ్‌తో రేవంత్ రెడ్డి వెళ్తుండగా ట్రాఫిక్ జామ్‌తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఫోటోను బీజేపీ షేర్ చేసింది. 

ప్రభుత్వం అప్పుల్లో ఉంది.. అనవసర ఖర్చులు వద్దని రేవంత్ రెడ్డి చెప్పారని... కానీ పత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చిందని ఇందుకు సంబంధించి వివిధ పత్రికల్లో ఇచ్చిన యాడ్స్ ఫోటోలను పేర్కొంది.
BJP
Revanth Reddy
Congress
Telangana

More Telugu News