YV Subba Reddy: వైనాట్ 175 లక్ష్యంతోనే పార్టీలో మార్పులు, చేర్పులు చేస్తున్నాం: వైవీ సుబ్బారెడ్డి

We are changing incharges to win 175 seats says YV Subba Reddy
  • మార్పు అవసరం అనుకున్న చోటే ఇన్ఛార్జీలను మారుస్తున్నామన్న సుబ్బారెడ్డి
  • బాబు, పవన్ ల కుట్రలు ఫలించవని వ్యాఖ్య
  • ప్రజలు మళ్లీ జగన్ నే సీఎం చేస్తారని ధీమా
వైనాట్ 175 లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని... అందుకే పార్టీలో మార్పులు, చేర్పులు చేస్తున్నామని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అసంతృప్తితో ఉన్న నేతలు పార్టీని వీడటం సాధారణంగా జరిగేదే అని చెప్పారు. మార్పు అవసరం అనుకున్న చోటే ఇన్ఛార్జీలను మారుస్తున్నామని తెలిపారు. అంతకు ముందు పని చేసిన నేతలకు కొత్త వాళ్లు సహకరించాలని కూడా చెపుతున్నామని అన్నారు. 

ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరడంపై స్పందిస్తూ... బీసీలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే పట్టుబట్టి వంశీకి ఎమ్మెల్సీ పదవిని ఇప్పించామని తెలిపారు. ఎమ్మెల్సీ పదవిని ఇచ్చిన పార్టీకి రాజీనామా చేసి వెళ్లడంపై ఆయనే సమాధానం చెప్పాలని అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఎన్ని కుట్రలు పన్నినా ముఖ్యమంత్రి జగన్ కు తిరుగులేదని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల కారణంగా ప్రజలు మళ్లీ జగన్ నే గెలిపిస్తారని అన్నారు. కోర్టు కేసుల వల్లే విశాఖకు రాజధాని తరలింపు అంశం ఆలస్యమవుతోందని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని... త్వరలోనే జగన్ విశాఖ నుంచి పాలన సాగిస్తారని అన్నారు.
YV Subba Reddy
Jagan
Chandrababu
Telugudesam
Pawan Kalyan
Janasena
Why not 175

More Telugu News