medigadda: రేపు మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లనున్న మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు

  • రేపు ఉదయం పది గంటలకు హెలికాప్టర్‌లో మేడిగడ్డకు బయలుదేరనున్న మంత్రులు
  • కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న అధికారులు
  • కాళేశ్వరం నిర్మాణంలో పాల్గొన్న అన్ని సంస్థలూ హాజరయ్యేలా ఆదేశాలు
Minisers Sridhar Babu and Uttam to visit Medigadda tomorrow

మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు రేపు (29 డిసెంబర్) మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నారు. శుక్రవారం ఉదయం పది గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో వారు హైదరాబాద్ నుంచి మేడిగడ్డకు బయలుదేరుతారు. బ్యారేజ్ వద్ద అధికారులు... మంత్రులకు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. కాళేశ్వరం కోసం అవసరమైన విద్యుత్.. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ సమస్యలు.. వాటి పరిష్కారాలపై ప్రజెంటేషన్ సందర్భంగా మంత్రులకు వివరించనున్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల లాభాలను... అలాగే నష్టాలనూ అధికారులు వివరిస్తారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ సంస్థలు, సబ్ కాంట్రాక్టర్లు, నిర్మాణంతో సంబంధం ఉన్న అందరూ రేపటి సమావేశంలో పాల్గొనేలా చూడాలని ఈఎన్సీకి ఇప్పటికే మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో రేపు నిర్మాణంలో పాల్గొన్న సంస్థలు కూడా పాల్గొననున్నాయి.

More Telugu News