Chandrababu: అది జరిగితే నా జన్మ ధన్యమైనట్టే: చంద్రబాబు

My good works should be remembered by future generations says Chandrababu
  • తాను చేసిన పనులను భవిష్యత్ తరాలు గుర్తు పెట్టుకోవాలన్న చంద్రబాబు
  • 2047కి ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ అవుతుందని ధీమా
  • ఎన్నికల ప్రచారంలో అందరూ పాల్గొనాలని పిలుపు
ప్రపంచానికి నాయకత్వం వహించే అవకాశం భారత్ కే ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బెంగళూరులో టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2047 సంవత్సరానికి ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ గా ఉంటుందని చెప్పారు. ఆర్థిక అసమానతలను తగ్గించాలనేదే తన కోరిక అని అన్నారు. ఏపీని బాగు చేయడానికి వంద రోజుల యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేయాలని సూచించారు. రానున్న ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రజలకు వివరించి చెప్పాలని అన్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా మీరు పాల్గొనాలని చెప్పారు. మీరు సంపాదించిన దాంట్లో 5 శాతాన్ని సమాజం కోసం వినియోగించాలని అన్నారు. తాను చేసిన పనులను భవిష్యత్ తరాలు గుర్తు పెట్టుకుంటే తన జన్మ ధన్యమైనట్టేనని చెప్పారు. తొలుత తనను గెలిపించింది విద్యార్థులేనని అన్నారు.  
Chandrababu
Telugudesam
Bengaluru

More Telugu News