Amit Shah: నేడు హైదరాబాద్ కు వస్తున్న అమిత్ షా

Amit Shah coming to Hyderabad
  • నేడు బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం
  • పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న అమిత్ షా
  • చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు నిర్వహించనున్న కేంద్ర హోం మంత్రి
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు హైదరాబాద్ కు వస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని కొంగరకలాన్ లో ఈరోజు బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అమిత్ షా హాజరుకానున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఆయన నొవోటెల్ హోటల్ కు వెళ్తారు. అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 

ఆ తర్వాత కొంగరకలాన్ కు వెళ్లి పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. కె. లక్ష్మణ్, డీకే అరుణ, బండి సంజయ్, ప్రకాశ్ జవదేకర్, తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, పార్టీ జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు హాజరుకానున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
Amit Shah
BJP
Hyderabad

More Telugu News