Ram Gopal Varma: దేశంలో ఏ పనికిమాలిన వాడూ మీకు హాని తలపెట్టడు.. ఆర్జీవీపై నాగబాబు పంచ్

  • ఆర్జీవీపై అమరావతి ఉద్యమనేత కొలికపూడి శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు 
  • శ్రీనివాసరావుపై ఏపీ డీజీపీకి ఆర్జీవీ ఫిర్యాదు
  • ఆర్జీవీ ప్రాణానికి ఎటువంటి అపాయం లేదంటూ మెగాబద్రర్ సెటైర్
  • హీరో, విలన్ తన్నుకుంటుంటే కమెడియన్‌పై ఎవరు దాడి చేస్తారని ప్రశ్న
Nagababu comments on RGV

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. వర్మకు ఎటువంటి ప్రమాదం రాదని, దేశంలో ఏ పనికిమాలిన వెధవా ఆయనకు హాని తలపెట్టడని సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. 

వ్యూహం పేరుతో వర్మ జగన్ బయోపిక్‌ను తెరకెక్కించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 29న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లలో వర్మ బిజీగా ఉన్నారు. అయితే, మూవీ రిలీజ్‌పై అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు ఓ టీవీ ఛానల్‌లో మాట్లాడుతూ తన సినిమాలతో ఆర్జీవీ సమాజానికి కంటకంగా మారాడని వ్యాఖ్యానించారు. ఆర్జీవీ తల నరికి తెచ్చిన వారికి కోటి రూపాయల బహుమతి కూడా ఇస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో ఆర్జీవీ..ఏపీ డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. 

ఈ ఉదంతంపై మెగా బ్రదర్ నాగబాబు సోషల్  మీడియా వేదికగా స్పందించారు. ‘‘ఆర్జీవీ గారిపై అటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు.. నేను కూడా వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆర్జీవీ గారూ మీరేం భయపడకండి. మీ జీవితానికి ఏ ఢోకా లేదు. మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఏపీలో.. ఆ మాటకొస్తే ఇండియాలో ఏ పనికిమాలిక వెధవా మీకెటువంటి హానీ తలపెట్టడు. ఎందుకంటే హీరో, విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్‌ గాడ్ని ఎవడూ చంపడు కదా! మీరేం వర్రీ అవకండి. నిశ్చింతగా, నిర్భయంగా ఓ ఓడ్కా పెగ్గేసి పడుకోండి. ఎల్లప్పుడూ మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి’’ అని పోస్ట్ పెట్టారు. ఇది నెట్టింట వైరల్‌గా మారింది.

More Telugu News