Eagle: దిల్లంతా గల్లంతైనదే... రవితేజ 'ఈగిల్' నుంచి మరో గీతం విడుదల

  • రవితేజ, కావ్యా థాపర్ జంటగా 'ఈగిల్'
  • కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం
  • నేడు రెండో సింగిల్ ను తీసుకువచ్చిన చిత్రబృందం
Second single from Raviteja starring Eagle out now

మాస్ మహారాజా రవితేజ, కావ్యా థాపర్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఈగిల్'. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సింగిల్ రిలీజైంది. "గల్లంతే గల్లంతే... దిల్లంతా గల్లంతైనదే" అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియోను చిత్రబృందం నేడు విడుదల చేసింది. దావ్ జాంద్ బాణీలు అందించగా, కృష్ణకాంత్ సాహిత్యం సమకూర్చారు. కపిల్ కపిలన్, లిన్ ఈ గీతాన్ని ఆలపించారు. 

'ఈగిల్' చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 13న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

More Telugu News