VH: గత పాలకులు ఏం చేశారనేది మాకు అనవసరం... మేం పిలుస్తున్నాం: వి,హనుమంతరావు

V Hanumantha Rao on Praja Palana
  • ప్రజాపాలనకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడి
  • ఆరు గ్యారెంటీలు త్వరలో అమలులోకి రానున్నాయన్న వీహెచ్
  • రేపటి నుంచి జనవరి 6 వరకు తెలంగాణలో ప్రజాపాలన
గత పాలకులు ఏం చేశారనేది తమకు అనవసరమని... తాము మాత్రం ఆరు గ్యారెంటీల అమలు నిమిత్తం నిర్వహించనున్న ప్రజాపాలనకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆరు గ్యారెంటీలు త్వరలో అమలులోకి రానున్నాయని తెలిపారు. ప్రజాపాలనకు తాము అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నామన్నారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీల కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తారు.
VH
Congress
BRS

More Telugu News