Seethakka: దరఖాస్తు ఫామ్‌ను ఇలా ఇవ్వండి...: ప్రజలకు మంత్రి సీతక్క సూచన

  • రేపటి నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన ఉంటుందన్న సీతక్క
  • ఆధార్, రేషన్ కార్డుతో పాటు ఓ ఫొటోను జతపరిచి దరఖాస్తు ఫామ్ ఇవ్వాలని సూచన
  • ప్రజాపాలన కార్యక్రమానికి అన్ని చర్యలు తీసుకోవాలని సూచన
Minister Seethakka suggestion to People over Praja palana

రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు జరగనున్న ప్రజాపాలన సందర్భంగా ఆశావహులు ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో పాటు ఒక ఫొటోను జతపరిచి దరఖాస్తు ఫామ్‌ను స్థానిక అధికారులకు అందజేయాలని మంత్రి సీతక్క సూచించారు. ప్రజాపాలనపై ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అధికారులతో ఆమె బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.

రేపటి నుంచి ప్రారంభమయ్యే ప్రజాపాలన కార్యక్రమానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తుదారులకు ఇబ్బంది లేకుండా గ్రామాల్లో వాటిని తీసుకోవాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు... సమన్వయంతో ప్రభుత్వ పథకాలను విజయవంతం చేయాలని వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్ జిల్లాలో పోడు భూములను సాగు చేస్తున్న రైతులకు పట్టాలు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

More Telugu News