Revanth Reddy: ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్

CM Revanth Reddy tweet after meeting with PM Modi
  • సీఎంగా బాధ్యతలు స్వీకరించాక మొదటిసారి మర్యాదపూర్వకంగా కలిసినట్లు వెల్లడి
  • తెలంగాణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరామన్న ముఖ్యమంత్రి
  • మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ప్రధానిని కలిసినట్లు వెల్లడి
ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక అనుసంధాన ఎక్స్ వేదిక ద్వారా ట్వీట్ చేశారు. 'తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యాను. ఇదే సమయంలో తెలంగాణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని... రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరాం' అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తాను ప్రధానితో సమావేశమైన సమయంలో తనతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఉన్నారని పేర్కొన్నారు.
Revanth Reddy
Congress
Narendra Modi
Mallu Bhatti Vikramarka

More Telugu News