Thandel: నాగచైతన్య 'తండేల్' షూటింగ్ ప్రారంభం

Akkineni Naga Chaitanya Thandel shoot begins

  • నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తండేల్
  • చందూ మొండేటి దర్శకత్వంలో చిత్రం
  • ఇటీవలే ఓపెనింగ్ షాట్
  • నేడు తొలి షెడ్యూల్ ప్రారంభమైందన్న గీతా ఆర్ట్స్

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'తండేల్'. ఇదొక విలక్షణ ప్రేమ కథా చిత్రం. ఇటీవల ఓపెనింగ్ సెర్మనీ జరుపుకున్న ఈ చిత్రం నేడు సెట్స్ పైకి వెళ్లింది. 

ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సోషల్ మీడియాలో వెల్లడించింది. 'తండేల్' చిత్రం షూటింగ్ ప్రారంభమైందని, ఈ షెడ్యూల్ లో సముద్రంలో ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు వివరించింది. "దుల్లకొట్టేయాల" అంటూ గీతా ఆర్ట్స్ ఉత్తరాంధ్ర యాసలో పేర్కొంది. క్రమం తప్పకుండా ఆసక్తికర అప్ డేట్స్ ఇస్తుంటామని తెలిపింది. కాగా, 'తండేల్' చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

More Telugu News