Virat Kohli: కోహ్లీ కూడా అవుట్... ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా

  • టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య మొదటి టెస్టు
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
  • 107 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా
  • రబాడాకు 3 వికెట్లు
Team India lost five wickets as Kogli out for 38 runs

బౌలింగ్ కు అనుకూలిస్తున్న సెంచూరియన్ పిచ్ పై టీమిండియా బ్యాటర్ల కష్టాలు కొనసాగుతున్నాయి. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 107 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. 64 బంతుల్లో 38 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఐదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 

రబాడా విసిరిన అవుట్ స్వింగర్ కు కోహ్లీ వద్ద జవాబు లేకపోయింది. రబాడా వేసిన ఈ డెలివరీ కోహ్లీ బ్యాట్ అంచును ముద్దాడుతూ వికెట్ కీపర్ వెర్రీన్ చేతుల్లో వాలింది. అంతముందు, 31 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ వికెట్ కూడా రబాడా ఖాతాలోనే చేరింది. రబాడా వేసిన బంతి అయ్యర్ వికెట్లను తాకింది. 

ఇన్నింగ్స్ ఆరంభంలో టీమిండియా 24 పరుగులకే 3 వికెట్లను చేజార్చుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ (5), యశస్వి జైస్వాల్ (17), శుభ్ మాన్ గిల్ (2) తక్కువ స్కోరుకే అవుటయ్యారు. ఈ దశలో కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ జోడీ కాసేపు దక్షిణాఫ్రికా బౌలర్లను ప్రతిఘటించింది. అయితే రబాడా విజృంభించడంతో టీమిండియా మరోసారి కష్టాల్లో పడింది. రబాడాకు 3 వికెట్లు దక్కాయి. నాండ్రే బర్గర్ 2 వికెట్లు తీశాడు. 

ప్రస్తుతం టీమిండియా స్కోరు 32 ఓవర్లలో 5 వికెట్లకు 107 పరుగులు. క్రీజులో కేఎల్ రాహుల్ (5 బ్యాటింగ్), రవిచంద్రన్ అశ్విన్ (0 బ్యాటింగ్) ఉన్నారు.

More Telugu News