Thummala: కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట కఠినంగా ఉంటుంది కానీ...: మంత్రి తుమ్మల

Minister Thummala comments on Minister Komatireddy
  • కోమటిరెడ్డి పనిమంతుడన్న తుమ్మల నాగేశ్వర రావు
  • రహదారుల అభివృద్ధికి సహకరించాలని కోమటిరెడ్డికి విజ్ఞప్తి
  • కొంతకాలంగా తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి ఆగిపోయాయని వ్యాఖ్య
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట కఠినంగా ఉంటుందని, కానీ పనిమంతుడని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లాలో మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ... ఆర్ అండ్ బి కోమటిరెడ్డి వద్ద ఉందని, కాబట్టి తమ జిల్లాలో రహదారుల అభివృద్ధికి సహకరించాలని కోరారు. కొత్తగూడెం నుంచి వెలిగొండ రోడ్డును కూడా పూర్తి చేయాలన్నారు. 

గత కొంతకాలంగా తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి ఆగిపోయాయని వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాష్ట్రాన్ని, జిల్లాను మళ్లీ అభివృద్ధి బాట పట్టిస్తామన్నారు. అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చిందని, తాము గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.  పేద, బడుగు, బలహీనవర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుతానన్నారు.
Thummala
Komatireddy Venkat Reddy
Congress

More Telugu News