Varun t: క్రిస్మస్ వేడుకల్లో మెరిసిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

  • మెగా ఇంట క్రిస్మస్ వేడుకలు
  • హాజరైన మెగా ఫ్యామిలీ మెంబర్స్, వారి సన్నిహితులు
  • సందడి చేసిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, కొణిదెల నిహారిక
Varun Tej and Lavanya Tripathi shines in mega Christmas celebrations

మెగా కుటుంబ సభ్యులు, వారి సన్నిహితులు ఒక్క చోట చేరి క్రిస్మస్ సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహారెడ్డి, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్... ఇలా లిస్టు చాలా పెద్దదే ఉంది. మహేశ్ బాబు అర్ధాంగి నమ్రతా శిరోద్కర్ కూడా ఈ క్రిస్మస్ వేడుకల్లో భాగం అయ్యారు. 

కాగా, ఇటీవలే పెళ్లి చేసుకున్న కొత్త జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఈ సెలబ్రేషన్స్ లో సందడి చేశారు. వారికి కొణిదెల నిహారిక కూడా తోడవడంతో సంబరాలు మిన్నంటాయి. ఈ మెగా క్రిస్మస్ హంగామాకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

More Telugu News