Hyderabad Corona: హైదరాబాద్ లో కరోనా కారణంగా ఒకరి మృతి.. ఈ ఏడాదిలో ఇదే తొలి మరణం

  • దేశ వ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కరోనా
  • తెలంగాణలో 55, ఏపీలో 29 యాక్టివ్ కేసులు
  • ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
Man died in Hyderabad with Corona

దేశ వ్యాప్తంగా కరోనా మళ్లీ పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 412 కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 4,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో సైతం కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా కారణంగా ఒక వ్యక్తి మృతి చెందాడు. 

అనారోగ్య కారణాలతో  ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లిన సదరు వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజటివ్ అని తేలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆయన మృత్యువాత పడ్డాడు. కరోనా కారణంగా తెలంగాణలో ఈ ఏడాది నమోదైన తొలి మరణం ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం తెలంగాణలో 55, ఏపీలో 29 యాక్టివ్ కేసులు ఉన్నట్టు సమాచారం. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో... దేశ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 

More Telugu News