Salaar: 'సలార్' .. నాలుగు రోజుల్లో నైజామ్ షేర్ ఎంతంటే ..!

  • రీసెంటుగా రిలీజైన 'సలార్'
  • తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న జోరు 
  • 4 రోజుల్లో నైజామ్ లో 50 కోట్ల షేర్
  • హైలైట్ గా నిలుస్తున్న ప్రభాస్ యాక్షన్ సీన్స్

Salaar Movie Update

ప్రభాస్ అభిమానులంతా ఇప్పుడు పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడ చూసినా 'సలార్' గురించే మాట్లాడుకుంటున్నారు. అది సొంతం చేసుకుంటున్న రికార్డులను గురించే చెప్పుకుంటున్నారు. వసూళ్ల విషయంలో ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ వెళుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది.
 
తెలుగు రాష్ట్రాల్లో ఆ జోరు మరింతగా తెలుస్తోంది. నాలుగు రోజుల్లో ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 50 కోట్ల షేర్ ను వసూలు చేయడం విశేషం. వీకెండ్ తరువాత కూడా ఈ సినిమా తన హవాను కొనసాగిస్తోంది. జనవరి 1వ తేదీ వరకూ థియేటర్ల దగ్గర ఈ సందడి కనిపిస్తూనే ఉంటుందని అంటున్నారు.

 ఆ రోజు నాటికి ఈ సినిమా 1000 కోట్ల మార్క్ ను టచ్ చేయడం ఖాయమని అభిమానులు చెబుతున్నారు. భారీతనం .. ప్రభాస్ మార్క్ యాక్షన్ సీన్స్ .. 'కేజీఎఫ్'ను పోలిన ప్రశాంత్ నీల్ టేకింగ్ ఈ సినిమాకి ఈ స్థాయి ఆదరణ లభించడానికి కారణమని చెబుతున్నారు. 

More Telugu News