Earthquake: లెహ్, లడఖ్ ప్రాంతంలో 4.5 తీవ్రతతో భూకంపం

  • తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో సంభవించిన భూప్రకంపనలు
  • 5 కిలోమీటర్ల భూకంప కేంద్రాన్ని గుర్తించిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ
  • ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టుగా లేని సమాచారం
Earthquake hits Leh and Ladakh region in Tuesday Morning

లెహ్, లడఖ్ ప్రాంత ప్రజలు మంగళవారం తెల్లవారుజామున భూకంపంతో ఉలిక్కిపడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదయింది. జనాలు గాఢనిద్రలో ఉన్న తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో భూప్రకంపనలు సంభవించాయి. ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. 

కొండ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయని, లెహ్, లడఖ్‌లో భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా వివరాలు వెల్లడించింది. కాగా దేశంలో ఏదో ఒక ప్రాంతంలో నమోదవుతున్న భూప్రకంపనలు ఆందోళనలు కలిగిస్తున్న విషయం తెలిసిందే.

More Telugu News