Revanth Reddy: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి... ప్రధాని నరేంద్రమోదీతో భేటీ?

CM Revanth Reddy to meet PM modi tomorrow
  • బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి రేవంత్ రెడ్డి
  • సాయంత్రం నాలుగు గంటలకు ప్రధానితో భేటీ అయ్యే అవకాశం
  • ఏఐసీసీ అగ్రనాయకులతోను సమావేశం!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధానికి వెళ్లనున్నారని తెలుస్తోంది. రేపు సాయంత్రం నాలుగు గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించవచ్చునని తెలుస్తోంది. ప్రధానితో భేటీ అనంతరం ఏఐసీసీ అగ్రనాయకులతోనూ రేవంత్ రెడ్డి సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల అమలు, తెలంగాణ అప్పులు, ఆస్తులు, కేబినెట్ విస్తరణ తదితర అంశాలపై దృష్టి సారిస్తున్నారు.
Revanth Reddy
Congress
Telangana
Narendra Modi

More Telugu News