నెట్ ఫ్లిక్స్ లో నయనతార లేటెస్ట్ మూవీ!

Annapoorani Movie OTT release date confirmed
  • ఈ నెల 1న థియేటర్లకు వచ్చిన 'అన్నపూరణి'
  • 29వ తేదీ నుంచి మొదలుకానున్న స్ట్రీమింగ్
  • నయనతార ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా 
  • కీలకమైన పాత్రల్లో నటించిన జై - సత్యరాజ్

తమిళంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేయాలనుకునేవారు ముందుగా నయనతార పేరునే పరిశీలిస్తారు. ఎందుకంటే నాయిక ప్రధానమైన కథలు .. పాత్రల విషయంలో నయనతార మరింత శ్రద్ధ పెడుతుంది. సోలోగా ఆమె చేసే కంటెంట్ విషయంలో ఆడియన్స్ కు కూడా బలమైన నమ్మకం ఉంటుంది. అందువలన ముందుగా మేకర్స్ ఆమెనే సంప్రదిస్తారు. 

అలా ఇటీవల కాలంలో ఆమె చేసిన నాయిక ప్రధానమైన తమిళ సినిమానే 'అన్నపూరణి'. నీలేశ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జై .. సత్యరాజ్ కీలకమైన పాత్రలను పోషించారు. ఈ నెల 1వ తేదీనే ఈ సినిమా తమిళనాట విడుదలైంది. అయితే అక్కడ వానల కారణంగా ఈ సినిమాను ప్రేక్షకులు రిసీవ్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. 

అలాంటి సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నెల 29 నుంచి తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ భాషల్లోను స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాలో నయనతార బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతిగా కనిపించనుంది. 
Go Back to Shorts
Nayanatara
Jai
Sathyaraj
Annapoorani

More Telugu News