Salaar: 'సలార్' సంచలనం .. 3 రోజుల్లో 402 కోట్లు!

  • ప్రభాస్ హీరోగా రూపొందిన 'సలార్'
  • ఈ నెల 22న విడుదలైన సినిమా 
  • ప్రపంచవ్యాప్తంగా 402 కోట్ల గ్రాస్ వసూళ్లు 
  •  ఈ రోజున కూడా కొనసాగుతున్న జోరు
  • 1000 కోట్లను రాబట్టడం ఖాయమనే టాక్  

Salaar Movie Update

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన 'సలార్' ఈ నెల 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రభాస్ నుంచి ఇంతకు ముందు వచ్చిన రెండు .. మూడు పాన్ ఇండియా సినిమాలు నిరాశపరచడం వలన, ఈ సినిమా విషయంలో అభిమానులు మరింత ఆసక్తిని కనబరిచారు. ఇది భారీ వసూళ్లను రాబట్టాలని ఆశించారు. 

అందుకు తగినట్టుగానే ఈ సినిమా ప్రభాస్ అభిమానులను ఆకట్టుకుంది. చాలా గ్యాప్ తరువాత అభిమానులు కోరుకున్నట్టుగా ప్రభాస్ కనిపించాడు. బడ్జెట్ పరంగా .. తారాగణం పరంగా .. ఫైట్స్ పరంగా ఈ సినిమా భారీతనాన్ని ఆవిష్కరించింది. రికార్డుస్థాయి ఓపెనింగ్స్ ను ప్రభాస్ కెరియర్ లో వేసింది. 

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 3 రోజుల్లో 402 కోట్లను వసూలు చేసింది. ఈ రోజున క్రిస్మస్ సెలవు దినం కావడం వలన వసూళ్ల జోరు తగ్గే అవకాశం లేదు. ఆ తరువాత కూడా ఇదే జోరు కనిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చాలా వేగంగానే ఈ సినిమా 1000 కోట్ల జాబితాలో చేరిపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

More Telugu News