Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వల్ప అస్వస్థత

CM Revanth Reddy surrering from fever
  • జ్వరంబారిన పడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • జూబ్లీహిల్స్‌లోని సీఎం ఇంటి వద్ద పరీక్షించి... మందులిచ్చిన ఫ్యామిలీ డాక్టర్
  • నిన్నటి కలెక్టర్ల సమావేశంలో నీరసంగా కనిపించిన సీఎం    
తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వ‌రం బారినప‌డ్డారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో డాక్ట‌ర్లు ఆయనకు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. మూడు రోజుల నుంచి ఆయన జ్వ‌రం, గొంతు నొప్పితో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇంటి వ‌ద్ద ఫ్యామిలీ డాక్ట‌ర్... రేవంత్ రెడ్డిని ప‌రీక్షించి, మందులిచ్చినట్టు తెలుస్తోంది. నిన్న సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో రేవంత్ రెడ్డి కాస్త నీరసంగా కనిపించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత నుంచి రేవంత్ రెడ్డి అస్వస్థతకు గురైనట్లుగా సమాచారం.
Revanth Reddy
Congress
Telangana

More Telugu News