Cyberabad: హైదరాబాద్‌లో సన్ బర్న్ వేడుకలకు అనుమతినివ్వలేదు: సైబరాబాద్ సీపీ

Cyberabad CP on SunBurn events
షార్ట్స్‌లో చూడండి
2024 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో సన్ బర్న్ ఈవెంట్‌కు అనుమతుల్లేవని సైబరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి తెలిపారు. సన్ బర్న్ పేరిట నిర్వహించతలపెట్టిన కార్యక్రమంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో సీపీ మహంతి స్పందించారు. ఈ ఈవెంట్ నిర్వహణకు నిర్వాహకులు తమ వద్ద దరఖాస్తు చేసుకున్నారని, కానీ తాము అనుమతి ఇవ్వలేదన్నారు.

మాదాపూర్‌లోని హైటెక్ సిటీ సమీపంలో ఈ ఈవెంట్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధపడ్డారన్నారు. అయితే ఇది ఇతర నగరాల్లో జరిగే సన్ బర్న్ వంటి వేడుక కాదని, అందుకే అనుమతులు నిరాకరించినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఈ ఈవెంట్ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఈవెంట్‌ను సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వకున్నా ఆన్‌లైన్‌లో టిక్కెట్ విక్రయాలు జరపడం చర్చనీయాంశంగా మారింది.
Go Back to Shorts
Cyberabad
Hyderabad
New Year 2024
Telangana

More Telugu News