Paytm: పేటీఎంలో మరోసారి ఉద్యోగాల కోత.. ఈసారి వెయ్యిమందికి పైనే తొలగింపు

  • గతంలోనూ ఉద్యోగులను తొలగించిన పేటీఎం
  • ఈ ఏడాది స్టార్టప్ కంపెనీలకు కలిసిరాలేదంటున్న నిపుణులు
  • మొదటి మూడు త్రైమాసికాలలో 28 వేల ఉద్యోగులను తొలగించిన కంపెనీలు
Paytm lays off over 1000 employees as cost cutting measure

ప్రముఖ స్టార్టప్ కంపెనీ పేటీఎం మరోమారు ఉద్యోగుల తొలగింపు చేపడుతోందని ప్రచారం జరుగుతోంది. ఈసారి దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను ఇంటికి పంపించిందని, మరింత మందిని సాగనంపే ఏర్పాట్లు చేస్తోందని సమాచారం. ఖర్చుల నియంత్రణ, పునర్వవస్థీకరణ పేరుతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లో ఈ తొలగింపులు జరుగుతాయని అనధికారిక సమాచారం.

ఈ ఏడాది మన దేశంలోని స్టార్టప్ కంపెనీలకు పెద్దగా కలిసిరాలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వివిధ స్టార్టప్ కంపెనీలు ఈ ఏడాది మొదటి మూడు త్రైమాసికాలలో ఏకంగా 28 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. గతేడాది ఈ సంఖ్య 20 వేలు ఉండగా.. 2021 లో 4 వేల మంది ఉద్యోగులు తమ జాబ్ కోల్పోయారు. ఫిన్ టెక్ రంగంలో ఈ ఏడాది ఉద్యోగుల తొలగింపు విషయానికి వస్తే పేటీఎం టాప్ లో ఉంది. సంస్థ వర్క్ ఫోర్స్ లో దాదాపు 10 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగుల తొలగింపు ప్రభావం స్టాక్ మార్కెట్ పైనా పడింది. పేటీఎం షేర్ల వాల్యూ దాదాపు 28 శాతం పడిపోయింది. గడిచిన ఆరు నెలల్లో పేటీఎం షేర్ ధర 23 శాతానికి పైగా తగ్గింది.

More Telugu News