Chandrababu: చంద్రబాబు నివాసంలో ముగిసిన మహా చండీయాగం, సుదర్శన హోమం.. ఫొటోలు ఇవిగో

Maha Chandi Yagam and Sudarshana Homam in Chandrababu residence completed
  • గత మూడ్రోజులుగా చంద్రబాబు నివాసంలో యజ్ఞయాగాదులు
  • నేడు పూర్ణాహుతి
  • ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు, నారా భువనేశ్వరి
టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో గత మూడ్రోజులుగా జరుగుతున్న యజ్ఞయాగాదులు నేటితో ముగిశాయి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ నెల 22 నుంచి మహా చండీయాగం, సుదర్శన హోమం నిర్వహిస్తున్నారు. ఇవాళ నిర్వహించిన పూర్ణాహుతితో ఈ క్రతువు సమాప్తం అయింది. పూర్ణాహుతి కార్యక్రమంలో చంద్రబాబు, నారా భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. 

ఈ యాగం చివరి రోజున చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. గుంటూరు నగరానికి చెందిన ప్రముఖ వేదపండితుడు శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో 40 మంది రుత్విక్కులు మహా చండీయాగం, సుదర్శన హోమం నిర్వహించారు.




Chandrababu
Maha Chandi Yagam
Sudarshana Homam
Undavalli
TDP
Andhra Pradesh

More Telugu News