Collector Shoes: అటెండర్ తో బూట్లు మోయించిన కలెక్టర్

Jayashankar Bhupalpally Collector Bhavesh Mishra Carrying Shoes With An Attendant
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ నిర్వాకం
  • సోషల్ మీడియాలో వైరల్ గా ఫొటోలు, వీడియోలు
  • కలెక్టర్ భవేశ్ మిశ్రా తీరును తప్పుబడుతున్న నెటిజన్లు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తన బూట్లను అటెండర్ తో మోయించారు. జిల్లా కేంద్రంలోని ఓ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో ఈ ఘటన చోటుచేసుకుంది. చర్చి ప్రాంగణంలోకి షూలతో ప్రవేశించిన కలెక్టర్.. ఆ వెంటనే తన షూలను విప్పి పక్కనే ఉన్న అటెండర్ చేతికి అందించారు. అటెండర్ ధఫేదార్ వాటిని తీసుకెళ్లి చర్చి బయట వదిలి వచ్చారు. అక్కడ ఉన్నవారు ఈ ఘటనను సెల్ ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

2015 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ భవేశ్ మిశ్రా ఇటీవలే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన ఉట్నూర్‌లోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారిగా పనిచేశారు. భద్రాచలం సబ్ కలెక్టర్‌గా కూడా పనిచేశారు. కాగా, అటెండర్ తో బూట్లు మోయించడంపై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ అయినా, అటెండర్ అయినా అందరూ ప్రభుత్వ ఉద్యోగులేనని, తోటి ఉద్యోగిని ఇలా కించపరచడం సరికాదని కామెంట్లు పెడుతున్నారు.
Collector Shoes
Attender
Jayashankar Bhupalpally
Bhavesh Mishra
Church
Chirstmas

More Telugu News