Infosys: కృత్రిమ మేధ ఉత్పత్తుల కాంట్రాక్ట్‌ను కోల్పోయిన ఇన్ఫోసిస్!

  • ఏఐ ఉత్పత్తుల అభివృద్ధికి సంబంధించి ఇన్ఫీతో ఓ గ్లోబల్ కంపెనీ ఒప్పందం
  • 15 ఏళ్ల గడువుతో రెండు సంస్థల మధ్య సెప్టెంబర్‌లో కుదిరిన ఎమ్‌ఓయూ
  • అంతర్జాతీయ కంపెనీ తాజాగా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు తెలిపిన ఇన్ఫోసిస్
Infosys loses big ai contract

ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఓ ఏఐ కాంట్రాక్ట్‌ను కోల్పోయింది. కృత్రిమ మేధ ఉత్పత్తుల అభివృద్ధికి సంబంధించి ఓ గ్లోబల్ కంపెనీతో కుదుర్చుకున్న ఎమ్ఓయూ రద్దు చేసుకున్నట్టు కంపెనీ తాజాగా స్టాక్ ఎక్సేంజీకి తెలిపింది. కాంట్రాక్ట్ రద్దు చేసుకునేందుకు సదరు గ్లోబల్ కంపెనీ మొగ్గు చూపినట్టు ఇన్ఫోసిస్ తెలిపింది. 

1.5 బిలియన్ డాలర్లతో ఈ సెప్టెంబర్‌లో రెండు సంస్థల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఏఐ ఉత్పత్తుల అభివృద్ధికి సంబంధించి 15 ఏళ్ల గడువుతో రెండు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ కంపెనీ కాంట్రాక్ట్ రద్దుకు మొగ్గు చూపింది. దీంతో, టెక్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న అనిశ్చిత పరిస్థితులపై మరోమారు చర్చ మొదలైంది. కాగా, శుక్రవారం ఇన్ఫోసిస్ షేరు 1.68 శాతం మేర లాభపడి రూ.1,562కు చేరింది.

More Telugu News