CPI Narayana: జగన్ కు వ్యతిరేకంగా టీడీపీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కలిస్తే మంచి కాంబినేషన్ అవుతుంది: సీపీఐ నారాయణ

  • ఏపీలో పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయన్న నారాయణ
  • బీజేపీతో కొనసాగే పార్టీలతో తాము కలవబోమని స్పష్టీకరణ
  • ఇండియా కూటమిలోకి రావాలని టీడీపీని ఆహ్వానిస్తున్నామని వెల్లడి
  • తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీయేనని స్పష్టీకరణ
CPI Narayana comments on AP politics

సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తాజా రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పరిస్థితులు రోజురోజుకీ మారిపోతున్నాయని అన్నారు. ఇండియా కూటమితో అనుకూలంగా ఉండే వ్యక్తులతో కలిసి ముందుకు సాగుతామని చెప్పారు. బీజేపీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిసి ఉండే పార్టీలతో తాము కలిసి వెళ్లేది లేదని నారాయణ స్పష్టం చేశారు. 

జగన్ కు వ్యతిరేకంగా టీడీపీ, వామపక్షాలు, కాంగ్రెస్ కలిస్తే మంచి కాంబినేషన్ అవుతుందని అభిప్రాయపడ్డారు. జగన్ ను ఎదుర్కోవాలంటే వివిధ పార్టీలు కలవాల్సిన అవసరం ఉందని అన్నారు. టీడీపీని ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. అయితే వారు బీజేపీతో కలిసి నడిచేందుకు ఆరాటపడుతున్నారని వ్యాఖ్యానించారు. 

మోదీని, కేంద్ర హోంమంత్రిని వ్యతిరేకిస్తే ఏం జరుగుతుందోనని ఆయా పార్టీలు భయపడుతున్నాయని నారాయణ పేర్కొన్నారు. బీజేపీ కారణంగా ఏపీ, తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లిందని, తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన పార్టీ బీజేపీ అని విమర్శించారు.

More Telugu News