Harish Rao: ప్రజల కోసం.. సిద్దిపేట అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తాను: హరీశ్ రావు

Harish rao on Siddipet development
  • ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన హరీశ్ రావు
  • పేద ప్రజలు ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచన
  • ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వసతులను ఉపయోగించుకోవాలన్న హరీశ్ రావు
సిద్దిపేట ప్రజల కోసం... సిద్దిపేట అభివృద్ధి కోసం తాను శాయశక్తులా కృషి చేస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. శనివారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 153 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ, జీవో 59 కింద 71 మందికి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... పేద ప్రజలు ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వసతులను ఉపయోగించుకోవాలని కోరారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నట్లు తెలిపారు.
Harish Rao
Telangana
BRS

More Telugu News