Prashant Kishor: చంద్రబాబుతో సమావేశమైన ప్రశాంత్ కిశోర్

Prashant Kishor held meeting with Chandrababu
  • లోకేశ్ తో కలిసి హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన ప్రశాంత్ కిశోర్
  • ఒకే వాహనంలో గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి వెళ్లిన లోకేశ్, పీకే
  • చంద్రబాబు-ప్రశాంత్ కిశోర్ భేటీలో రాబిన్ శర్మ టీమ్ సభ్యులు
  • టీడీపీ రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న రాబిన్ శర్మ
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ మధ్యాహ్నం నారా లోకేశ్ తో కలిసి ప్రశాంత్ కిశోర్ విజయవాడ చేరుకున్నారు. వారిరువురు ఒకే వాహనంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. ప్రశాంత్ కిశోర్ ను చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. కాగా, చంద్రబాబు-ప్రశాంత్ కిశోర్ భేటీలో రాబిన్ శర్మ టీమ్ సభ్యులు కూడా పాల్గొన్నారు. 'షో టైమ్ కన్సల్టెన్సీ' పేరిట రాబిన్ శర్మ టీడీపీ రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు. లోకేశ్, ప్రశాంత్ కిశోర్ కలిసి హైదరాబాద్ నుంచి విజయవాడ రావడంతోనే రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.
Prashant Kishor
Chandrababu
TDP
Andhra Pradesh

More Telugu News