KTR: డ్రైవింగ్ సీట్లో కేటీఆర్.. పక్కన హరీశ్ రావు.. వావ్ అంటున్న బీఆర్ఎస్ శ్రేణులు

KTR and Harish Rao in one car
  • రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం
  • ఒకే కారులో కార్యక్రమానికి వెళ్లిన కేటీఆర్, హరీశ్ రావు
  • ఫొటోలను షేర్ చేసిన హరీశ్ రావు
శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె పర్యటనలో భాగంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు కూడా హాజరయ్యారు. వీరిద్దరూ తెలంగాణ భవన్ నుంచి ఒకే కారులో రాష్ట్రపతి నిలయంకు వెళ్లారు. కేటీఆర్ కారును డ్రైవ్ చేయగా, హరీశ్ రావు పక్క సీట్లో కూర్చున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి గవర్నర్ తిమిళిసై, సీఎం  రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానాలు అందాయి. దీంతో, కేటీఆర్, హరీశ్ రావులు ఎమ్ హోం కార్యక్రమానికి వెళ్లారు. ఒకే కారులో బావబామ్మర్దులు వెళ్లిన ఫొటోను హరీశ్ రావు ట్విట్టర్ లో షేర్ చేశారు. 
KTR
Harish Rao
BRS

More Telugu News