Ram Gopal Varma: రేపే 'వ్యూహం' ప్రీ రిలీజ్ ఈవెంట్... చంద్రబాబు, లోకేశ్, పవన్ లను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా: వర్మ

Varma invites opposition leaders to Vyuham pre release event
  • పొలిటికల్ డ్రామాగా వ్యూహం
  • వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం
  • ఈ నెల 23న విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • డిసెంబరు 29న ప్రేక్షకుల ముందుకు వస్తున్న వ్యూహం
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా చిత్రం 'వ్యూహం' ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు జరగనుంది. ఈ కార్యక్రమానికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా నిలవనుంది. ఈ చిత్రం ఏపీ సీఎం జగన్ రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టాల ఆధారంగా రూపుదిద్దుకున్నట్టు ప్రచారంలో ఉంది. అయితే, అనూహ్య రీతిలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావాలంటూ ఏపీ విపక్ష నేతలకు దర్శకుడు వర్మ ఆహ్వానం పలికారు. 

"రేపు 23వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు 'వ్యూహం' ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి రావాలంటూ చంద్రబాబును, నారా లోకేశ్ ను, పవన్ కల్యాణ్ ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా" అంటూ వర్మ ట్వీట్ చేశారు. అంతేకాదు, వ్యూహం జగ గర్జన ఈవెంట్ పేరిట ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్టర్ ను కూడా వర్మ పంచుకున్నారు. 

'వ్యూహం' చిత్రం డిసెంబరు 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Ram Gopal Varma
Vyuham
Pre Release Event
Chandrababu
Nara Lokesh
Pawan Kalyan
Vijayawada
Andhra Pradesh

More Telugu News