Devineni Uma: లోకేశ్ దెబ్బకు దిగొచ్చిన జగన్ పోలీసులకు అలవెన్సులు ప్రకటించాడు: దేవినేని ఉమ

  • పోలీసులకు 7 నెలల కిందట అలవెన్సులు నిలిపివేశారన్న ఉమా
  • తాము అధికారంలోకి వస్తే అలవెన్సులు ఇస్తామని లోకేశ్ ప్రకటించారని వెల్లడి
  • లోకేశ్ ప్రకటనతో వైసీపీ ప్రభుత్వంలో వణుకు మొదలైందని వ్యాఖ్యలు
  • వెంటనే స్పెషల్ జీవో జారీ చేసిందని వివరణ
Devineni Uma comments on YCP govt

టీడీపీ యువనేత నారా లోకేశ్ దెబ్బకు దిగొచ్చిన సీఎం జగన్ పోలీసులకు అలవెన్సు ప్రకటించాడని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా పేర్కొన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్న పోలీసులకు ఏపీ ప్రభుత్వం 7 నెలల కిందట స్పెషల్ అలవెన్సులు నిలిపివేసిందని తెలిపారు. 

ఏపీలో పోలీసులకు జరిగిన అన్యాయంపై ఇటీవలి యువగళం-నవశకం సభలో నారా లోకేశ్ ప్రభుత్వాన్ని ఎండగట్టారని దేవినేని ఉమా వెల్లడించారు. టీడీపీ అధికారంలోకి రాగానే అలవెన్సులు ఇస్తామని వేదికపై నుంచి లోకేశ్ ప్రకటించారని, లోకేశ్ ప్రకటనతో వైసీపీలో వణుకు మొదలైందని వివరించారు. గతంలో నిలిపివేసిన అలవెన్సులను వైసీపీ ప్రభుత్వం వెంటనే విడుదల చేసిందని పేర్కొన్నారు. ఆ మేరకు స్పెషల్ జీవో విడుదల చేసిందని తెలిపారు. 

లోకేశ్ హామీ కారణంగానే తమకు న్యాయం జరిగిందని పోలీసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఉమా స్పష్టం చేశారు.

More Telugu News