Stock Market: వారాన్ని లాభాలతో ముగించిన స్టాక్ మార్కెట్లు

  • ఈరోజు ఆద్యంతం ఒడిదుడుకుల మధ్య కొనసాగిన మార్కెట్లు
  • 242 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 94 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమయినప్పటి నుంచి ఒడిదుడుకుల మధ్య కొనసాగిన మార్కెట్లు చివరకు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 242 పాయింట్లు లాభపడి 71,107కి చేరుకుంది. నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 21,349 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
విప్రో (6.59%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.83%), టాటా మోటార్స్ (2.24%), మారుతి (2.01%), టెక్ మహీంద్రా (1.96%). 

టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.13%), బజాజ్ ఫైనాన్స్ (-1.00%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.98%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.93%), యాక్సిస్ బ్యాంక్ (-0.69%).

More Telugu News