Dinosaur Eggs: డైనోసార్ గుడ్లను కులదేవతలుగా పూజిస్తున్నారు.. మన దేశంలోనే!

People offering prayers to Dinosaur eggs
  • మధ్యప్రదేశ్ లోని థార్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
  • డైనోసార్ గుడ్లను స్వాధీనం చేసుకున్న అధికారులు
  • గతంలో ఇదే ప్రాంతంలో 256 డైనోసార్ గుడ్లను గుర్తించిన శాస్త్రవేత్తలు
డైనోసార్ గుడ్ల శిలాజాలను తమకు తెలియకుండానే కొన్నేళ్లుగా కులదేవతలుగా పూజిస్తున్న ఉదంతం మధ్యప్రదేశ్ థార్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు డైనోసార్ గుడ్లను దేవతలుగా పూజిస్తున్నారనే విషయాన్ని శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. వీటిని పొలాల సరిహద్దుల్లో ఉంచి పూజిస్తున్నారు. నర్మదా వ్యాలీ ప్రాంతంలో లక్షల సంవత్సరాల క్రితం డైనోసార్లు సంచరించేవని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఇదే ప్రాంతంలో గతంలో 256 డైనోసార్ గుడ్లను కనుకున్నారు. తాజాగా డైనోసార్ గుడ్లను పూజిస్తున్న ప్రాంతానికి చేరుకున్న అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటి పరిణామం 15 నుంచి 17 సెంటీమీటర్లుగా ఉంది. గతంలో లభించిన డైనోసార్ గుడ్లను పరిరక్షించడానికి 2011లో డైనోసార్ శిలాజాల జాతీయ పార్కును కూడా ఏర్పాటు చేశారు. ఈ గుడ్లన్నీ శిలాజాలుగా మారాయి.
Dinosaur Eggs
Madhya Pradesh

More Telugu News