మన పొరుగుదేశాలన్నీ చంద్రుడిని చేరుకున్నాయి.. మనం మాత్రం ఇక్కడే..: భారత్‌ను ప్రశంసించిన పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్
- ఇస్లామాబాద్‌లో పార్టీ కేడర్‌తో మాట్లాడుతూ నవాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- మన ఆర్థిక పతనానికి మనమే కారణమని ఆవేదన
- మన కాళ్లను మనమే నరుక్కున్నామన్న నవాజ్
- తన హయాంలో దేశం అభివృద్ధి పథంలో సాగిందని స్వోత్కర్ష
2013లో దేశం తీవ్ర విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొంటే మనమొచ్చి దానిని పరిష్కరించామని, దేశంలో ఉగ్రవాదాన్ని రూపుమాపి కరాచీలో శాంతి నెలకొల్పామని, రహదారులు నిర్మించామని, చైనా- పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ) వచ్చిందని, అభివృద్ధిలో నూతనశకం ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. దేశంలో నెలకొన్న సంక్షోభాలకు ఎవరిని నిందించాలని, మన కాళ్లను మనమే నరుక్కున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రభుత్వ హయాంలో దేశంలో ఆబ్‌పరా, ఇస్లామాబాద్‌లో 2 పాకిస్థానీ రూపాయలకే రొట్టె లభించేదని, కానీ ఇప్పుడది 30 రూపాయలకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, 1993, 1999, 2017లో దేశానికి ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ నాలుగోసారి ప్రధాని పదవికి ప్రయత్నిస్తున్నారు.