Keshav Maharaj: నువ్వు మైదానంలోకి ఎప్పుడొచ్చినా ఇదే పాట వేస్తారా?.. కేఎల్ రాహుల్ ప్రశ్న.. సౌతాఫ్రికా బ్యాటర్ సమాధానం.. వీడియో ఇదిగో!

Keshav Maharaj and KL Rahul Conversation on Ram Siya Ram Song Goes Viral
  • భారత్-సౌతాఫ్రికా మధ్య బోలాండ్ పార్క్‌లో మూడో వన్డే
  • కేశవ్ క్రీజులోకి రాగానే ప్లే అయిన ‘రామ్ సియా రామ్’ పాట
  • ఉత్సాహం ఆపుకోలేక కేశవ్‌ను అడిగేసిన రాహుల్
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టులో కేశవ్ మహారాజ్‌ది ప్రత్యేక స్థానం. భారతీయ మూలాలు కలిగిన ఈ ఆటగాడు ఎప్పుడు మైదానంలోకి దిగినా బ్యాక్‌గ్రౌండ్‌లో ‘రామ్ సియా రామ్’ పాట ప్లే అవుతూ ఉంటుంది. భారత్‌తో నిన్న బోలాండ్ పార్క్‌లో జరిగిన మూడో వన్డేలో అతడు బ్యాటింగ్‌కు దిగుతున్నప్పుడు కూడా ఇదే పాట డీజేలో ప్లే అయింది. కేశవ్ మహారాజ్ బ్యాటింగ్‌కు దిగినా, బౌలింగ్‌కు సిద్ధమైనా ఈ పాట మైదానంలో తప్పనిసరిగా ప్రేక్షకుల చెవిని తాకుతుంది. 

నిన్న కూడా అతడు బ్యాటింగ్ కి వస్తున్న సమయంలో అదే పాట ప్లే అయింది. దీంతో ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌కు సిద్ధమవుతున్న కేశవ్‌ను పిలిచి మరీ అడిగేశాడు. ‘‘కేశవ్ భాయ్.. నువ్వు ఎప్పుడొచ్చినా ఈ పాట (రామ్ సియా రామ్) పాట ప్లే చేస్తారా?’’ అని అడిగాడు. అవునంటూ కేశవ్ నవ్వుతూ సమాధానం చెప్పాడు. స్టంప్స్ వద్ద ఉన్న మైక్‌లో వీరి సంభాషణ రికార్డయింది. ఆపై సోషల్ మీడియాకెక్కి వైరల్ అయింది.
Keshav Maharaj
KL Rahul
Team India
South Africa
Ram Siya Ram

More Telugu News