Telangana: తెలంగాణలో చలి పులికి వణుకుతున్న ప్రజలు.. పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు

  • బుధవారం రాత్రి సిర్పూర్‌లో అత్యల్పంగా 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
  • రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు
  • మిగిలిన జిల్లాల్లో 10-15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు, హైదరాబాద్‌లో 10.7 డిగ్రీల ఉష్ణోగ్రత 
  • మరో మూడు నాలుగు రోజులు పరిస్థితి ఇలాగే ఉండొచ్చన్న అధికారులు
Telangana night temparatures fall

తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. బుధవారం రాత్రి రాష్ట్రంలో 19 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 10 నుంచి 15 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్‌లో అత్యల్పంగా 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లోని జైనథ్‌లో 7.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. హైదరాబాద్‌లో 10.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  

ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే చలి తీవ్రత అధికంగా ఉంది. ఇక్కడి అన్ని జిల్లాల్లో అల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యయి. రాబోయే మూడు రోజుల్లో చలి తీవ్రత ఉంటుందనీ, ఉష్ణోగ్రతలు కాస్తంత తగ్గే అవకాశం ఉందని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ రిపోర్టులో తేలింది. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ కాలంలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో పిల్లలు, వృద్ధులు, గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

More Telugu News