Rajeev Chandrasekhar: రైల్లో ఎదురుపడ్డ బాలుడికి లాప్‌టాప్ గిఫ్ట్ ఇచ్చిన కేంద్ర మంత్రి

Union Minister gifts laptop to Kerala boy he met during train journey

  • రైల్లో మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌కు తారసపడ్డ కేరళ చిన్నారి
  • తాను రూపొందించిన వీడియోలు మంత్రికి చూపించిన బాలుడు
  • చిన్నారికి ఓ కొత్త లాప్‌టాప్ బహుమతిగా ఇస్తానన్న మంత్రి
  • ఇచ్చిన మాటను నిలబెట్టుకుంలూ గురువారం బాలుడికి బహుమతి అందజేత

కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఓ బాలుడికి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ చిన్నారికి ఓ లాప్‌టాప్ గిఫ్ట్‌గా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. ‘‘త్రిస్సూర్ నుంచి కోజీకోడ్‌కు వెళుతుండగా రైల్లో తొమ్మిదేళ్ల బాలుడు శ్రీరామ్ తారసపడ్డాడు. తాను రూపొందించిన పలు సృజనాత్మక వీడియోలను నాకు సంబరపడుతూ చూపించాడు. అప్పుడు నేను అతడికి కొత్త లాప్‌టాప్ బహుమతిగా ఇస్తానని మాటిచ్చా. ఈ రోజు కాస్తంత ముందుగానే న్యూ ఇయర్ బహుమతి కింద అతడికి కొత్త లాప్‌టాప్ ఇచ్చా’’ అని మంత్రి పేర్కొన్నారు. బాలుడికి, అతడి కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి చిన్నారి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

Rajeev Chandrasekhar
BJP
Kerala
  • Loading...

More Telugu News