AP Assembly: జూన్ 16తో ఏపీ అసెంబ్లీ గడువు ముగుస్తుంది: కేంద్ర ఎన్నికల సంఘం

  • మూడేళ్ల కంటే ఎక్కువ ఒకే చోట పనిచేస్తున్న అధికారులను తక్షణమే బదిలీ చేయాలని ఆదేశం
  • సొంత జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులనూ ట్రాన్స్‌ఫర్ చేయాలని రాష్ట్రాలకు సూచన
  • 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు
AP Assembly term ends on June 16 Central Election Commission announced

వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌ సహా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలకు భారత ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో పాల్గొననున్న అధికారుల బదిలీలపై కీలక సూచనలు చేసింది. సొంత జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఒకే చోట మూడేళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేస్తున్న అధికారులను తక్షణమే బదిలీచేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. 

పోలీసులు సహా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు అందరికీ ఈ నియమాలు వర్తిస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కాగా 2024లో ఆంధ్రప్రదేశ్‌తోపాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16తో ముగియనుందని ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తావించింది.

More Telugu News